Oke oka maata Lyrics - chakri
Singer | chakri |
Composer | chakri |
Music | chakri |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని ...
చరణం 1
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ నీకు చెప్పాలని
చరణం 2
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీ ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ నీకు చెప్పాలని
Oke oka maata madilona daagundi mounamgaa
oke oka maata pedavopalenanta teeyamgaa
naa peru nee premanii
naa daari nee valapanii
naa choopu nee navvanii
naa oopire nuvvanii
neeku cheppaalani
nenu ani lenu ani chebite em chestaavu
nammanani navvukoni chaalle pomantaavu
nee manasuloni aasagaa nilichedi nenanii
nee tanuvuloni sparsagaa tagiledi nenanii
nee kantimaimarupulo nanu polchukontaananii
tala aanchi nee gundepai naa peru vintaananii
neeku cheppaalani
nee adugai nadavadame payanamannadi paadam
ninu vidichi batakadame maranamannadi praanam
nuvu raakamundu jeevitam gurutaina ledanii
ninu kalusukunna aa kshanam nanu vodiliponanii
prati ghadiya o janmagaa ne gaduputunnaananii
ee mahima needenanii neekaina telusaa anii
neeku cheppaalani