Maatakandani paataga, Mallelateeramlo Sirimallepuvvu Lyrics - Nithya santhoshini
Singer | Nithya santhoshini |
Composer | Pawan kumar |
Music | Pawan kumar |
Song Writer | Uma maheswar |
Lyrics
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లె పువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోన పరాగమే మనమే
సుశీలమైనా స్వరములోనా ఇద్దరమే.. మనమిద్దరమే..
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
తూరుపు వెలుగుల పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైన చిన్నబోయే ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల యెరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యొతులమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
స్వచ్చపు తొలకరి వెచ్చని జల్లుల పచ్చని కాంతులలో మనమే
గల గల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్న బోయె రంగులన్ని ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతం ఎరగని చరితలు చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లె పువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోన పరాగమే మనమే
సుశీలమైనా స్వరములోనా ఇద్దరమే.. మనమిద్దరమే..
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
matakandani paataga manamiddaramu kalisamuga
malle puvvula darilo oka swasai adugesamuga
sumalu virise sarasulona paragame maname
suseelamaina swaramulona iddarame.. manamiddarame..
matakandani paataga manamiddaramu kalisamuga
toorupu velugula padamati jilugula pagadapu merupulalo maname
sagara teerapu challani galula ganamlo maname
chandrudaina chinnaboye indhradhanusuna iddarame
cheekati nalupuna iddarame
chigurakula yerupuna maname
alalaku kaduluthu alasata erugani nadachina navalu maname
aasala ushassuna aarani jyotulamiddarame
matakandani paataga manamiddaramu kalisamuga
swacchapu tolakari vecchani jallula pacchani kanthulalo maname
gala gala parugula sarigama palukula selapatala maname
ningi nela chinnaboye rangulanni iddarame
musirina manchuna maname
gatiyinchani anchuna maname
dwaitam yerugani charithalu cherapani kammi priyakatha maname
voohala jagaalalo vupiri voosulamiddarame