Chiguraku Chaatu, Gudumba Shankar Lyrics - S.P. Charan, Sujatha
Singer | S.P. Charan, Sujatha |
Composer | Mani Sharma |
Music | Mani Sharma |
Song Writer | Chandrabose |
Lyrics
చిగురాకు చాటు చిలకా ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా
చిగురాకు చాటు చిలకా తను నడవద ధీమాగా
అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
అయితే అది తేలనిదే అడుగు పడదుగా
సరికొత్తగ నా వంక చూస్తుంది
చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా
చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా
తప్పనుకుంటూ తప్పదంటూ తరకమాగేనా
సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా
తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా
వణికే నా పెదవుల్లో తొణికే తడి పిలుపేదో
నాకే సరిగా ఇంకా తెలియకున్నది \
తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో
ఆ వైనం మౌనంలో మునిగి వున్నది
ఎక్కడినుంచో మధురగానం మదిని మీటింది
ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది
గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది
కొంపలుముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది
వేరే ఏదో లోకం చేరే ఉహల వేగం
ఏదో తీయని మైకం పెంచుతున్నది
దారే తెలియని దూరం తీరే తెలపని తీరం
తనలో కలవరమేదో రేపుతున్నది
chiguraku chatu chilakaa ee alajadi premegaa
alavatu ledu ganaka madi suluvuga nammadugaa
chiguraku chatu chilaka tanu nadavada dheemagaa
anukoni dari ganaka ee tikamaka tappadugaa
tanu kudaa nalaga anukunte melegaa
ayite adi telanide adugu padadugaa
sarikottaga na vanka chustundi chitramga
yemaindo spastamga bayatapadadugaa
cheppaku antu cheppamantu charcha telenaa
tappanukuntu tappadantu tarkamaagenaa
sangati chustu jali vestu kadalalekunna
telani guttu tene pattu kadapalekunna
vanike na pedavullo tonike tadi pilupedo
nake sarigaa inkaa teliyakunnadi
tanalo tanu yededo gonige aa kaburedo
aa vainam mounamlo munigi vunnadi
ekkadinuncho madhuraganam madini meetindi
ikkadi nunche ne prayanam modalu antondi
galagala veeche pillagali yendukaagindi
kompalu munche tuphanoche suchanemo idi
vere yedo loka chere uhala vegam
yedo teeyani maikam penchutunnadi
dare teliyani duram teere telapani teeram
tanalo kalavaramedo reputunnadi